పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు వెంటజనుట

  •  
  •  
  •  

10.1-1622-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టు దన్నుఁ బట్టవచ్చినఁ
టుతర జవరేఖ మెఱసి ట్టుబడక ది
క్తము లదుర హరి పాఱెం
టులగతిన్ వాఁడు దోడఁ నుదేరంగన్.

టీకా:

ఇటు = ఈ విధముగ; తన్నున్ = అతనిని; పట్టన్ = పట్టుకొనుటకు; వచ్చినన్ = రాగా; పటుతర = మిక్కిలి అధికమైన {పటువు - పటుతరము - పటుతమము}; జవ = వేగపు; రేఖ = రీతి; మెఱసి = ప్రకాశించి; పట్టుబడకన్ = దొరకకుండ; దిక్తటములు = దిగంతములు; అదురన్ = అదిరిపోవునట్లుగా; హరి = కృష్ణుడు; పాఱెన్ = పరుగెత్తెను; చటుల = తీవ్రమైన; గతిన్ = వేగముగ పోవుటచే; వాడు = అతను; తోడన్ = కూడా, వెంట; చనుదేరన్ = వచ్చుచుండగా.

భావము:

అలా యవనుడు తనను పట్టడానికి వస్తుంటే కృష్ణుడు పట్టుపడకుండా మిక్కిలి వేగంగా దిక్కులదరిలా పరుగెత్తాడు. కాలయవనుడు అతని వెంటపడ్డాడు.