పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బలరాముడు విజృంభించుట

  •  
  •  
  •  

10.1-1567-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱిమి హలి హలము విసరుచు
నెఱిఁ గదిసిన బెగడి విమతనికరము లెడలై
వెఱఁగుపడు నొదుఁగు నడఁగును
ఱుపడుఁ జెడు మడియుఁ బొరలు రలుం దెఱలున్.

టీకా:

తఱిమి = వెంటబడి; హలి = బలరాముడు; హలమున్ = నాగలి ఆయుధమును; విసరుచున్ = విసురుగా వేయుచు; నెఱిన్ = క్రమముగా; కదిసినన్ = దగ్గరకురాగా; బెగడి = వెరచి; విమత = శత్రువుల; నికరములు = సమూహములు; ఎడలు = చెదిరినవి; ఐ = అయ్యి; వెఱగుపడున్ = ఆశ్చర్యపోవును; ఒదుగున్ = ముడుచుకొనును; అడగును = ఆణగిపోవును; మఱుపడు = దాగును; చెడున్ = అంగవిహీనతచెందును; మడియున్ = చచ్చును; పొరలు = పొర్లెదరు;   మరలున్ = వెనుదిరుగును; తెఱలున్ = పారిపోవును.

భావము:

బలభద్రుడు తరుముతూ తన నాగలిని త్రిప్పుతూ సమీపించగా శత్రుసమూహాలు భయపడి దూరంగా పారిపోతాయి; ఆశ్చర్య పోతాయి; ప్రక్కకు తొలగుతాయి; లోబడుతాయి; చాటుకు పోతాయి; చెడిపోతాయి; చనిపోతాయి; నేలబడి పొర్లుతాయి; వెనుదిరిగి పారిపోతాయి; కలతచెందుతాయి.