పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధుని సంవాదము

  •  
  •  
  •  

10.1-1557-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హేషల్ గజబృంహితంబులు రథాంగారావముల్ శింజనీ
టంకారములున్ వివర్ధిత గదా క్రాస్త్ర నాదంబులున్
శబ్దంబులు భేరి భాంకృతులు నిస్సాణాది ఘోషంబులున్
దప్రక్రియ నొక్కవీఁక నెగసెన్ బ్రహ్మాండభేద్యంబుగన్.

టీకా:

హయ = గుఱ్ఱముల; హేషల్ = సకిలింతలు; గజ = ఏనుగుల; బృంహితంబులున్ = ఘీంకారములు; రథాంగా = రథచక్రముల; రవముల్ = ధ్వనులు; శింజనీ = వింటినారి {శింజని - ధనుస్సుకు సంధించెడి తాడు, అల్లెతాడు}; చయ = సమూహముల; టంకారములున్ = టం అను ధ్వనులు; వివర్ధిత = విశేషముగ వర్ధిల్లెడి, సమృద్ధి చెందిడి, విజృంభించెడి; గదా = గదాయుధముల యొక్క; చక్రా = చక్రాయుదముల యొక్క; అస్త్ర = అస్త్రముల; నాదంబులున్ = శబ్దములు; జయ = విజయ; శబ్దంబులున్ = నినాదములు; భేరీ = పెద్దనగారాల యొక్క; భాంకృతులు = భాం అను మోతలు; నిస్సాణ = పెద్దడప్పులు, రాండోళ్ళు {నిస్సాణ - చర్మవాద్య విశేషము}; ఆది = మున్నగువాని; ఘోషంబులున్ = చప్పుళ్ళు; భయద = భయము కలిగించెడి; ప్రక్రియన్ = రీతిగా; ఒక్కవీగన్ = ఒకసారిగా; ఎగసెన్ = లేచినవి, మోగినవి; బ్రహ్మాండ = బ్రహ్మాండమును; భేద్యంబు = బద్దలుచేయునవి; కన్ = అయినట్లుగ.

భావము:

(ఆ ముట్టడిలో) గుఱ్ఱాల సకిలింపులు; ఏనుగుల ఘీంకారాలు; రథచక్రాల ధ్వనులు; వింటినారి మ్రోతలు; పెచ్చుమీరుతున్న గద చక్రం బాణం మున్నగు ఆయుధముల శబ్దాలు; జయజయారావాలు; భేరి మొదలైన చర్మవాద్యముల భంకారాలు; భయజనకములై బ్రహ్మాండాన్ని భేదిస్తున్నట్లు ఒక్కపెట్టున చెలరేగాయి.