పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధుని సంవాదము

  •  
  •  
  •  

10.1-1552-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలుఁడ వీవు కృష్ణ! బలద్రునిఁ బంపు రణంబు సేయ; గో
పాక! బాలుతోడ జనపాలశిఖామణి యైన మాగధుం
డాము సేసె నంచు జను లాడెడి మాటకు సిగ్గు పుట్టెడిం
జాలుఁ దొలంగు దివ్యశరజాలుర మమ్ము జయింపవచ్చునే?"

టీకా:

బాలుడవు = పిల్లవాడవు, బలము తక్కువ వాడవు; ఈవు = నీవు; కృష్ణ = కృష్ణుడా; బలభద్రునిన్ = బలరాముడిని; పంపు = పంపించుము; రణంబు = యుద్ధము; చేయన్ = చేయుటకు; గోపాలక = గొల్లవారి; బాలు = పిల్లవాని; తోడన్ = తోటి; జనపాల = రాజులలో; శిఖామణి = మిక్కిలి శ్రేష్ఠుడు; ఐన = అయిన; మాగధుండు = మగధాధీశుడు; ఆలము = ఆగడము, యుద్ధము; చేసెను = చేసెను; అంచున్ = అని; జనులు = ప్రజలు; ఆడెడి = పలికెడి; మాట = మాటల; కున్ = కు; సిగ్గు = లజ్జ; పుట్టెడిన్ = కలుగుతుంది; చాలున్ = ఇక చాలు; తొలంగు = తప్పుకొనుము; దివ్య = మహిమాన్వితములైన; శర = బాణములువేయ; చాలురన్ = సమర్థులను; మమ్మున్ = మమ్ము; జయింపవచ్చునే = గెలువశక్యమా, కాదు.

భావము:

“కృష్ణా! ఓ పశువుల కాసేవాడా! నీవు చిన్న పిల్లవాడివి. నాతో పోరాడడానికి మీ అన్న బలరాముడిని పంపు. రాజచూడామణి అయిన ఈ మగధ రాజ్యాధిపతి పిల్లకాయతో యుద్ధంచేసా డని లోకులు అంటుంటే మేము సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. మేము అమోఘమైన బాణాలు కలవాళ్ళం మమ్మల్ని నువ్వు ఎక్కడ గెలవ గలవు కాని, ఇక చాలు అవతలికి పొమ్ము.”