పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరాసంధునితో పోర వెడలుట

  •  
  •  
  •  

10.1-1541-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యులు తల్లడిల్ల దనుజాంతకుఁ డొత్తె గభీరఘోష కా
ఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చై
న్యము ధన్యమున్ దివిజ తాపస మాన్యముఁ బ్రీత భక్త రా
న్యము భీత దుశ్చరిత శాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.

టీకా:

అన్యులు = శత్రువులు; తల్లడిల్లన్ = కలత చెందునట్లుగా; దనుజాంతకుడు = కృష్ణుడు {దను జాంతకుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; ఒత్తెన్ = పూరించెను; గభీర = గంభీరమైన; ఘోష = ధ్వనితో; కాఠిన్య = కఠినమైన; మహా = గొప్ప; ప్రభావ = ప్రభావము కలది; వికటీకృత = కలత నొందించబడిన; పద్మభవాండ = బ్రహ్మాండము నందలి {పద్మభవాండము - పద్మభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; జంతు = జీవుల; చైతన్యమున్ = చేతనత్వము కలది; ధన్యమున్ = కృతార్థత్వము కలది; దివిజ = దేవతలచేత; తాపస = మునులచేత; మాన్యమున్ = గౌరవింపబడునది; ప్రీత = సంతోషింప జేయబడిన; భక్త = భక్తులలో; రాజన్యమున్ = శ్రేష్ఠులు కలది; భీత = భయపెట్టబడిన; దుశ్చరిత = చెడ్డ నడవడిక కల; శాత్రవ = శత్రువుల; సైన్యమున్ = సైన్యము కలది; పాంచజన్యమున్ = పాంచజన్యము అను శంఖము {పాంచజన్యము - పంచజనుని దేహమునుండి పుట్టిన శంఖము, కృష్ణుని శంఖము}.

భావము:

శత్రువులు చలించిపోయేలా, దైత్యవిధ్వంసి ఐన శ్రీకృష్ణుడు గంభీరము, కర్కశము అయిన తన నినాద మహా మహిమచే బ్రహ్మాండములోని జీవరాసుల చైతన్యాన్ని వికటీకరించేది; దేవతలచేత మునులచేత మన్నింపబడేది; భక్తులైన రాజులను సంతోషపెట్టేది; చెడునడతగల వైరి సైన్యములకు భయము కల్గించేది; ధన్యమైనది అయిన పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు.