పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కుబ్జగృహంబున కేగుట

  •  
  •  
  •  

10.1-1492-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళీనివహ నివేదిత
మాలా మృగనాభిపంక ణిమయభూషా
చేలాలంకృత యగుచును
హేలావతి గోరె వనరుహేక్షణుఁ గవయన్.

టీకా:

ఆళీ = చెలికత్తెల; నివహ = సమూహముచే; నివేదిత = ఇయ్యబడిన; మాలా = పూలదండలు; మృగనాభి = కస్తూరి కలిపిన; పంక = గంధము; మణి = రత్నాలు; మయ = పొదిగిన; భూషా = ఆభరణములు; చేలా = వస్త్రములచే; అలంకృత = అలంకరింపబడిన ఆమె; అగుచును = అగుచు; హేలావతి = విలాసవంతురాలు; కోరెన్ = అపేక్షించెను; వనరుహేక్షణున్ = కృష్ణుని; కవయన్ = కలియవలెనని.

భావము:

చెలికత్తెలు ఆమెను పూల దండలతో, కస్తూరి లేపనంతో, మణులు పొదిగిన నగలు వలువలుతో అలంకరించారు. విలాసవతియైన కుబ్జ తామరరేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణునితో సంగమాన్ని కోరింది.