పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉద్ధవునికడ గోపికలు వగచుట

  •  
  •  
  •  

10.1-1483-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గులరె మగలను మగువలు?
గులదె తను మున్ను కమల? గవు విడిచియుం
గిలిన మగువల విడుచుట
దఁ దని తనుఁ దగవు బలుకఁ గుదువు హరికిన్.

టీకా:

తగులరె = మోహింపరా; మగలను = మగవారిని; మగువలు = స్త్రీలు; తగులదె = మోహింపలేదా; తనున్ = అతనిని; మున్ను = పూర్వము; కమల = లక్ష్మీదేవి; తగవు = తమ సంసార ధర్మమును; విడిచియున్ = వదలి; తగిలిన = మోహించినట్టి; మగువలన్ = స్త్రీలను; విడుచుట = విడుచుట; తగదు = తగినపని కాదు; అని = అని; తనున్ = ఆ కృష్ణునికి; తగవున్ = న్యాయము; పలుకన్ = చెప్పుటకు; తగుదువు = తగినవాడవు; హరి = కృష్ణుని; కిన్ = కి.

భావము:

పడతులు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తనను ప్రేమించలేదా? న్యాయము విడిచి మరీ ప్రేమించే రమణీమణులను విడిచిపెట్టడం తగదు అనే న్యాయమును కృష్ణుడికి చెప్పడానికి నీవే తగిన వాడవు.