పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉద్ధవునికడ గోపికలు వగచుట

  •  
  •  
  •  

10.1-1478-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చునొకో మదిం దలఁచి మాధవుఁ డా యమునాతటంబునం
ఱుచగు దివ్యసౌరభ లతా గృహసీమల నేము రాగ; మా
ఱువులనుండి నీడలకు మ్మెలయించి కలంచి దేహముల్
చినఁ దేల్చి నూల్కొలిపి న్మథలీలలఁ దేల్చు చందముల్.

టీకా:

మఱచునొకొ = మరచిపోయెనేమో; మదిన్ = మనసునందు; తలచి = తలచుకొని; మాధవుడు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; యమునా = యమునానదీ; తటంబునన్ = తీరమునందు; తఱచు = దట్టమైనది; అగు = అయిన; దివ్య = మంచి; సౌరభ = పరిమళములుగల; లతాగృహ = పొదరిండ్ల; సీమలన్ = ప్రదేశములందు; ఏము = మేము; రాగ = వచ్చుటతోనే; మా = మా యొక్క; మఱువుల = మాటుల; నుండి = నుండి; నీడల్ = పొదరిండ్లనీడలలోని; కున్ = కి; మమ్మున్ = మమ్ములను; ఎలయించి = చేర్చి; కలంచి = కలవరపెట్టి; దేహముల్ = ఒళ్ళు; మఱచినన్ = తెలియకపోగా; తేల్చి = పరవశముచేసి; నూల్కొలిపి = పురికొలిపి; మన్మథలీలలన్ = మన్మథక్రీడల యందు; తేల్చు = సంతోషపెట్టు; చందముల్ = విధములను.

భావము:

లక్ష్మీదేవి వలచిన వాడు అయిన శ్రీకృష్ణుడు యమునానది ఒడ్డున దివ్యపరిమళాలు వెదజల్లు పూపొదరిండ్ల నీడలకు మమ్మల్ని జేర్చి, ఎలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచెనా ఏమి?