పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఉద్ధవుడు గోపికల నూరార్చుట

  •  
  •  
  •  

10.1-1470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను మీకడకుం గృష్ణుఁడు
నిపంపెడు వేళఁ బిలిచి లికిన పలుకుల్
వినుఁ; డన్నియు వివరించెద
జేక్షణలార! మీరు గవకుఁ డింకన్."

టీకా:

ననున్ = నన్ను; మీ = మీ; కడ = వద్ద; కున్ = కు; కృష్ణుడు = కృష్ణుడు; పనిపంపెడు = కార్యార్థము పంపించెడి; వేళన్ = సమయము నందు; పిలిచి = పిలిచి; పలికిన = చెప్పిన; పలుకుల్ = మాటలను; వినుడు = వినండి; అన్నియున్ = అన్నిటిని; వివరించెద = వివరముగా తెలిపెదను; వనజేక్షణలారా = ఓ ఇంతులు {వనజేక్షణ - వనజ (పద్మములవంటి) ఈక్షణ (కన్నులు కలామె), సుందరి}; మీరు = మీరు; వగవకుండు = విచారించకండి; ఇంకన్ = ఇక.

భావము:

కలువ కన్నుల గోపికా కన్నెలారా! శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపే పని అప్పజెప్పుతూ నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరింగా చెప్తాను. వగపు మాని సావధానంగా వినండి.”