పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : భ్రమర గీతములు

  •  
  •  
  •  

10.1-1466-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ దల్లులఁ దండ్రులన్ మనో
జాంతఁ జేసి డించి తను మ్మిన మమ్ము వియోగదుర్దశా
సింధువులోనఁ ద్రోచి యిటు చేరక పోవుట పాడిగాదు; పు
ష్పంయ! మీ యధీశునకుఁ బాదములంబడి యొత్తి చెప్పవే.

టీకా:

బంధులన్ = బంధువులను; బిడ్డలన్ = పిల్లలను; మగలన్ = భర్తలను; భ్రాతలన్ = తోబుట్టువులను; తల్లులన్ = తల్లులను; తండ్రులన్ = తండ్రులను; మనోజ = మన్మథ వేదనవలని; అంధతన్ = గుడ్డితనము; చేసి = చేత; డించి = విడిచి; తనున్ = అతనిని; నమ్మిన = నమ్మినట్టి; మమ్మున్ = మమ్ములను; వియోగ = ఎడబాటు వలని; దుర్దశా = దుఃఖము నెడి; సింధువు = సముద్రములో; త్రోచి = పడతోసి; ఇటు = ఈ పక్కకి; చేరకపోవుట = రాకపోవుట; పాడి = న్యాయము; కాదు = కాదు; పుష్పంధయ = తుమ్మెద {పుష్పంధయము - పువ్వులలోని మధువునుం గ్రోలునది, తుమ్మెద}; మీ = మీ యొక్క; అధీశున్ = ప్రభువు; కున్ = కి; పాదములన్ = కాళ్ళమీద; పడి = పడి; ఒత్తి = నొక్కి; చెప్పవే = చెప్పుము.

భావము:

ఓ తుమ్మెదా! (పుష్పాలలోని మధువు గ్రోలే దానవు. పూల వలె మృదువైన దానివి.) చుట్టాలనూ, సుతులనూ, భర్తలనూ, అన్నదమ్ములనూ, తలితండ్రులనూ మనసును మథిస్తున్న ఈ అంధత్వముచే వదలిపెట్టి, తన్నే శరణు జొచ్చాము. అలాంటి మమ్ముల్ని కాదని, విరహాగ్ని కడలిలో త్రోసివైచి, ఈలాగున మా వంక చేరకుండుట న్యాయము కాదని ప్రభువు శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి గట్టిగా నొక్కి చెప్పు.