పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : భ్రమర గీతములు

  •  
  •  
  •  

10.1-1459-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే
ఱొటిం బొందెడి భంగి మ మ్మధరపియ్యూషంబునం దేల్చి మా
లం కోజ్జ్వల యౌవనంబు గొని యన్యాసక్తుఁ డయ్యెన్ విభుం
టా! యాతని కెట్లు దక్కె సిరి? మిధ్యాకీర్తి యయ్యెంజుమీ.

టీకా:

ఒక = ఒకానొక; పువ్వు = పుష్పము; అందలి = లోని; తేనెన్ = మకరందమును; త్రావి = తాగి; మధుపా = తుమ్మెద {మధుపా - మధువు తాగునది, తుమ్మెద, కల్లు తాగుటచేత వలె మనసును కలతపెట్టునది}; ఉత్సాహివి = ఉత్సాహము కలవాడవు; ఐ = అయ్యి; నీవు = నీవు; వేఱు = ఇంక; ఒకటిన్ = ఒకదానిని; పొందెడి = చేరెడి; భంగిన్ = విధముగ; మమ్మున్ = మమ్ములను; అధరపియ్యూషంబున్ = అధరామృతములతో; తేల్చి = సంతృప్తులను చేసి; మా = మా యొక్క; అకలంక = స్వచ్ఛమైన; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; యౌవనంబున్ = యౌవనమును; కొని = గ్రహించి, అపహరించి; అన్య = ఇతరుల ఎడ; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; అయ్యన్ = అయ్యాడు; విభుండు = ప్రభువు; అకటా = అయ్యో; ఆతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగా; దక్కెన్ = దొరికెను; సిరి = లక్ష్మి; మిధ్యా = అబద్ధపు; కీర్తి = కీర్తి; అయ్యెన్ = కలిగినది; సుమీ = సుమా.

భావము:

ఓ మధువులు పానీయం చేసే ఓ తుమ్మెదా! ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దానిని విడిచిపెట్టి ఉత్సాహంగా మరో పువ్వును నీవు ఆశ్రయించినట్లే, శ్రీకృష్ణుడు తన అధరసుధారసాన్ని మమ్మల్ని గ్రోలనిచ్చి, మా అచ్చమైన ఉజ్వలమైన యవ్వనం దొంగిలించాడు. పిమ్మట అన్యకాంతా ఆసక్తుడు అయ్యాడు. అయ్యయ్యో! ఇలాంటి చంచలచిత్తుడికి శ్రీమహాలక్ష్మి ఎలా కైవశం అయినదో? అతడి ఉత్తమశ్లోకుడన్న కీర్తి వట్టి బూటకం అయినది కదే.