పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందోద్ధవ సంవాదము

  •  
  •  
  •  

10.1-1445-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని హరి మున్నొనరించిన
ను లెల్లనుఁ జెప్పి చెప్పి బాష్పాకుల లో
నుఁడై డగ్గుత్తికతో
వియంబున నుండె గోపవీరుం డంతన్.

టీకా:

అని = అని; హరి = కృష్ణుడు; మున్ను = మునుపు; ఒనరించిన = చేసిన; పనులు = పనులు; ఎల్లనున్ = అన్నిటిని; చెప్పిచెప్పి = వివరముగా చెప్పి; బాష్ప = కన్నీటిచే; ఆకుల = కలతచెందిన; లోచనుడు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; డగ్గుతిక = గద్గద స్వరంతో, బొంగురు పోయిన గొంతు {డగ్గుతిక - దుఃఖాదులచే నోట మాట వెడలుటలోని ఇబ్బంది, గొంతు బొంగురు పోవుట}; తోన్ = తోటి; వినయంబునన్ = అణకువతో; ఉండెన్ = ఉండెను; గోపవీరుండు = నందుడు {గోపవీరుడు - గోపకులలో వీరుడు, నందుడు}; అంతన్ = అంతట.

భావము:

అని గోపాలశ్రేష్ఠుడు నందుడు పలికాడు. శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములు అన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి బొంగురుపోయిన కంఠంతో మాటాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు.