పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందోద్ధవ సంవాదము

  •  
  •  
  •  

10.1-1441-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై
మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ" డనుచున్ న్నించి పూజించి వాం
ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స
ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంక్షించి మోదంబునన్.

టీకా:

ఆ = ఆ యొక్క; పుణ్యాత్మునిన్ = మంచిమనసు కలవానిని; కౌఁగిలించుకొని = ఆలింగనముచేసి; నంద = నందుడనెడి; ఆభీరుడు = గోపకుడు; ఆనంది = సంతోషించినవాడు; ఐ = అయ్యి; మా = మా; పాలింటి = మట్టు; కిన్ = కు; కృష్ణుడు = కృష్ణుడు; ఈతడు = ఇతనే; అనుచున్ = అని; మన్నించి = మిక్కిలి మర్యాదలు చేసి; పూజించి = పూజించి; వాంఛా = కోరిక; ఆపూర్ణంబు = తీరినది; కన్ = అగునట్లుగ; మంజుల = చక్కటి; అన్నము = అన్నమును; ఇడి = పెట్టి; మార్గాయసమున్ = ప్రయాణబడలికను; పాపి = పోగొట్టి; సల్లాప = ముచ్చటలాడెడి; ఉత్సాహము = వేడుక; తోడన్ = తోటి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; సంలక్షించి = చూచి; మోదంబునన్ = సంతోషముతో.

భావము:

నందుడు ఆ పుణ్యాత్ముడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. “ఇతడు మా పాలిటి గోపాలకృష్ణుడు” అంటూ సాదరంగా మన్ననలు చేసాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టించాడు. ప్రయాణం బడలిక పోగొట్టాడు. ముచ్చటలాడే కోరికతో ఉద్దవుడితో ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు.