పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శయ్యన నుంచుట

  •  
  •  
  •  

10.1-147-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాక్షునిఁ దెచ్చుటయును
సుతఁ గొనిపోవుటయును దా నెఱుఁగక మూఁ
గినిద్ర జొక్కియుండెను
జాక్షి యశోద రేయి సుధాధీశా!

టీకా:

వనజాక్షునిన్ = శ్రీకృష్ణుని {వనజాక్షుడు - వనజము (పద్మము)ల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; తెచ్చుటయును = తీసుకొని వచ్చుట; తన = తన యొక్క; సుతన్ = పుత్రికను; కొనిపోవుటయును = తీసుకొని పోవుట; తాన్ = ఆమె; ఎఱుగక = తెలియక; మూగిన్ = ముంచుకొచ్చిన; నిద్రన్ = నిద్ర యందు; చొక్కి = మైమరచిపోయి; ఉండెను = ఉండెను; వనజాక్షి = అందగత్తె {వనజాక్షి - పద్మాక్షి, సుందరి}; యశోద = యశోదాదేవి; రేయి = ఆ రాత్రి; వసుధాధీశ = రాజా {వసుధాధీశుడు - భూమికి ప్రభువు, రాజు}.

భావము:

మహారాజా! పరీక్షిత్తూ! ఆ పద్మాల లాంటి కళ్ళున్న నల్లనయ్యను తీసుకురావడంకాని, తన కూతురును తీసుకుపోవడంకాని ఏమాత్రం ఎరుకలేకుండా యశోదాదేవి మైమరచి కమ్ముకు వచ్చిన నిద్రమైకంలో ఆ రాత్రంతా ఉండిపోయింది. (పద్మాల్లాంటి కళ్ళున్న ఆ యశోదాదేవికి అలాంటి కళ్ళున్న కొడుకు)