పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రామకృష్ణుల ఉపనయనము

  •  
  •  
  •  

10.1-1410-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త
త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
ర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

టీకా:

ఉర్విన్ = భూలోము నందు; మానవులు = మనుష్యులు {మానవుడు - మనువు వలన పుట్టినవాడు, మనుజుడు}; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినప్పటికి; గురువు = గురువువలన; వాక్య = ఉపదేశమును; ఉద్యుక్తులు = పొందినవారు; ఐ = అయ్యి; కాని = కాని; తత్ = దానికి; పూర్వ = ముందుగనే; ఆరంభము = ప్రయత్నము; చేయబోలదు = చేయకూడదు; అనుచున్ = అని; బోధించు = తెలియజేసెడి; చందంబునన్ = రీతిని; సర్వజ్ఞత్వము = అన్ని తెలిసి యుండుట; తోన్ = తోకూడి ఉండి; జగత్ = లోకములకు; గురువులు = గొప్పవారు; ఐ = అయ్యి; సంపూర్ణులు = ఎట్టి లోటు(లోపము)లేని వారు, నిండు స్వభావులు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; గుర్వు = గురువును; అంగీకరణంబు = స్వీకరించుట; చేయన్ = చేయుటకు; చనిరి = వెళ్ళిరి; ఆ = ఆ ప్రసిద్ధులైన; గోవిందుడును = కృష్ణుడు; రాముడున్ = బలరాముడు.

భావము:

భూలోకంలో మానవులు ఎవరైనా సరే గురువు నుండి ఉపదేశం పొందితే తప్ప ఏ విద్య అనుష్ఠానం మొదలుపెట్ట రాదు సుమా, అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తము నెరిగిన వారైనప్పటికినీ జగద్గురువులు అయినప్పటికీ; పరిపూర్ణులు అయినప్పటికీ; బలరామకృష్ణులు ఆచార్యుడి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు.