పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చాణూర ముష్టికులతో పోరు

  •  
  •  
  •  

10.1-1349-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భద్రుఁడు ముష్టికుఁడును
ములు మెఱయంగఁ జేసి బాహాబాహిం
బ్రయాగ్నుల క్రియఁ బోరిరి
వెయఁగ బహువిధములైన విన్నాణములన్.

టీకా:

బలభద్రుడు = బలరాముడు; ముష్టికుడును = ముష్టికుడు; బలములు = బలములు; మెఱయంగన్ = ప్రకాశించునట్లు; చేసి = చేసి; బాహాబాహిన్ = ముష్టాముష్టి, చేతులతో పెనగులాటల చేత; ప్రళయ = ప్రళయకాలపు; అగ్నుల = అగ్నిశిఖల; క్రియన్ = వలె; పోరిరి = పోరాడిరి; వెలయగన్ = ప్రసిద్ధముగా; బహు = అనేక; విధములు = విధములు; ఐన = అయినట్టి; విన్నాణములన్ = నేర్పులతో.

భావము:

అనేక రకాల బలవిన్యాసాలతో బలరాముడు, ముష్టికుడు తమ తమ బలాలు చూపుతూ ప్రళయకాలం లోని అగ్నుల చందాన చేతులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు.