పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చాణూరునితో సంభాషణ

  •  
  •  
  •  

10.1-1337-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సాములు లేవు; పిన్నలము; త్వము గల్దనరాదు; మల్ల సం
గ్రా విశారదుల్ గులిశ ర్కశదేహులు మీరు; మీకడన్
నేము చరించు టెట్లు? ధరణీశుని వేడ్కలు చేయువారముం
గాము; వినోదముల్ సలుపఁ గాదనవచ్చునె యొక్కమాటికిన్.

టీకా:

సాములు = సాముగరిడీలు చేయుటలు; లేవు = లేవు; పిన్నలము = చిన్నవాళ్ళము; సత్వము = బలము; కల్దు = ఉంది; అనరాదు = అనుటకు లేదు; మల్ల = కుస్తీ; సంగ్రామ = పోటీలలో; విశారదుల్ = మిక్కిలి నేర్పరులు; కులిశ = వజ్రాయుధమువలె; కర్కశ = కఠినములైన; దేహులు = శరీరములు కలవారు; మీరు = మీరు; మీ = మీ; కడన్ = వద్ద; నేము = మేము; చరించుట = మెలగుట; ఎట్లు = ఎలా; ధరణీశుని = రాజునకు; వేడ్కలు = వినోదములు; చేయువారమున్ = చేసేవాళ్ళము; కాము = కాదు; వినోదముల్ = వేడుకలు; సలుపన్ = చేయుటకు అంటే; కాదు = వద్దు; అనవచ్చునె = అని చెప్ప వచ్చా, చెప్పరాదు; ఒక్క = ఒక; మాటికిన్ = సారికైనను.

భావము:

“మాకు సాములు తెలియవు. మేము చిన్నవాళ్ళం. సత్తా ఉందని చెప్పలేము. మీరేమో కుస్తీపట్లలో నిష్ణాతులు. వజ్రాయుధం లాంటి కరుకైన శరీరాలు కలవారు. ఇలాంటి మీతో మేము ఎలా తలపడాలి. మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాము కానీ, ఆడదామని ఆహ్వానిస్తే ఎప్పుడైనా కాదని అనరాదు కదా!