పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చాణూరునితో సంభాషణ

  •  
  •  
  •  

10.1-1334-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సత్వంబులు మేలె? సాము గలదే? త్రాణమే మేను? భూ
ప్రరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?
వివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?
నీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!

టీకా:

జవ = వడి, వేగము; సత్వంబులు = బలములు; మేలె = బాగా ఉన్నవా; సాము = వ్యాయము చేయుట; కలదే = కలదా; సత్రాణమే = కాచుకునే శక్తి కలదేనా; మేను = దేహము; భూప్రవరుండున్ = రాజుకు; పోసనము = పోషణ, బ్రతుకు; ఇమ్ము = ఇప్పించమని; అనంగవలెనే = చెప్పవలెనా; పాళీలు = పాళీలు {పాళీలు - మల్లవిద్యావిశేషములు}; అభీష్టంబులే = ఇష్టమేనా; పవివో = వజ్రాయుధమువా ఏమో; కాక = కాని ఎడల; కృతాంత = యముని {కృతాంతుడు - చేయబడిన వినాశము కలవాడు, యముడు}; దండకమవో = దండాయుధమువా ఏమో; ఫాలాక్షు = శివుని {ఫాలాక్షుడు - నుదుట కన్ను కలవాడు, శివుడు}; నేత్ర = కంటి; అగ్నివో = నిప్పువా ఏమో తప్పించి; నవనీతంబుల = వెన్న {నవనీతము - నవోద్ధృతము, నవీనమైన పెరుగునుండి తీయబడినది, వెన్న}; ముద్ద = కడి; కాదు = కాదు; మెసగన్ = మెక్కుటకు; నా = నా యొక్క; ముష్టి = పిడికిటి గుద్దు; గోప = గొల్ల; అర్భకా = పిల్లవాడా.

భావము:

ఓ గొల్లపిల్లాడా! నీకు జవసత్త్వాలు బాగా ఉన్నయా? బాగా సాము నేర్చావా? శరీరం గట్టిదేరిందేనా? మహారాజు మిమ్మల్ని మెచ్చుకోవాలా? మల్ల విద్యా విశేషం పాళీలు అంటే ఇష్టమేనా? నా పిడికిటిపోటంటే ఏమిటో తెలుసా? ఇది పిడుగు లాంటిది లేదా యముని కాలదండం వంటిది లేదా ముక్కంటి కంటిమంట అనుకో నా పిడికిలిగ్రుద్దు వెన్నముద్ద కాదు తినటానికి. అర్ధమయిందా?