పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసుడు దుశ్శకునము ల్గనుట

  •  
  •  
  •  

10.1-1301-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురికి రామకృష్ణులు
నుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా
నువుఁ గదిసి విఱుచుటయును
విని కంసుఁడు నిద్రలేక విహ్వలమతియై.

టీకా:

తన = అతని యొక్క; పురి = పట్టణమున; కిన్ = కు; రామ = బలరామ; కృష్ణులు = శ్రీకృష్ణులు; చనుదెంచి = వచ్చి; నిజ = తన యొక్క; అనుచరులన్ = సేవకులను; చంపుటయున్ = సంహరించుటను; మహా = గొప్ప; ధనువున్ = విల్లును; కదిసి = చేరి; విఱుచుటయును = విరగగొట్టుట; విని =ఆలకించి; కంసుడు = కంసుడు; నిద్ర = నిద్ర; లేక = పట్టక; విహ్వలమతి = భయాదులచేత వశము తప్పిన మనసు కల వాడు, కలతబారిన మనసు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను సంహరించడమూ, అంత గొప్ప ధనుస్సును విరిచివేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు మనసు కలతబారింది.