పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శ్రీమానినీచోర దండకము

  •  
  •  
  •  

10.1-1245-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"యదుకుల విద్వేషణుఁడై
మున వర్తించు కంసు ర్దించి భవ
త్సనంబుఁ జూడ వచ్చెదఁ
బొ యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!"

టీకా:

యదు = యాదవ; కుల = వంశమునకు; విద్వేషణుడు = విరోధము గలవాడు; ఐ = అయ్యి; మదమున = గర్వముచేత; వర్తించు = నడచెడి; కంసున్ = కంసుని; మర్దించి = చంపి; భవత్ = నీ యొక్క; సదనంబున్ = నివాసమును; చూడన్ = చూచుటకు; వచ్చెదన్ = రాగలవాడను; పొద = పొమ్ము; ఈ = ఈ యొక్క; స్యందనమున్ = రథమును; కొనుచున్ = తీసుకొనిపోవుచు; పురమున్ = నగరమున; కున్ = కు; అనఘా = పాపరహితుడా.

భావము:

“పాపరహితుడవైన అక్రూరా! యాదవులకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు.”