పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శ్రీమానినీచోర దండకము

  •  
  •  
  •  

10.1-1239-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“జములు చేరువ నున్నవి
పోయఁగ నీవు పోయి డ వయ్యె; నదీ
ముల నభమున ధరణిం
లుగని చోద్యములు నీకుఁ గానంబడెనే?"

టీకా:

జలములు = నీరు; చేరువన్ = దగ్గరలోనే; ఉన్నవి = ఉన్నాయి; తలపోయగ = విచారించగా; నీవు = నీవు; పోయి = వెళ్ళి; తడవు = చాలాసేపు; అయ్యెన్ = అయినది; నదీ = నది యొక్క; జలమున = నీళ్ళ యందు; నభమునన్ = ఆకాశమునందు; ధరణిన్ = భూమిమీద; కలుగని = లేనట్టి; చోద్యములు = వింతలు; నీ = నీ; కున్ = కు; కానంబడెనే = కనబడినవా ఏమి.

భావము:

“నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కదా. నీవు స్నానానికి వెళ్ళి చాలా సేపయింది. ఆకాశంలోనూ, భూమిలోనూ లేని వింతలేమైనా నదీజలాలలో కాని కన్పించాయా?”