పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుని దివ్యదర్శనములు

 •  
 •  
 •  

10.1-1234-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భోగి భోగపర్యంక మధ్యంబున;-
లనొప్పు పచ్చని లువవాని
మేఘంబుపై నున్న మెఱుఁగు చందంబున-
నురమున శ్రీదేవి యొప్పువాని
ముసురు తేఁటులు విప్ప ముఖచతుష్కముగల;-
నయుఁ డాడెడి బొడ్డుమ్మివానిఁ
దలని బహుపదక్రమవిశేషంబుల-
వము చూపెడి నూపుములవాని

10.1-1234.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లజగర్భ రుద్ర నక సనందన
ద్ద్విజామర ప్రస్యమాన
రితుఁడైనవాని సౌందర్యఖనియైన
వాని నొక్క పురుషర్యుఁ గాంచె.

టీకా:

ఆ = ఆ; భోగి = సర్ప; భోగ = శరీరము అనెడి; పర్యంక = పాన్పు; మధ్యంబునన్ = నడిమిభాగమునందు; వలనొప్పు = అందముగనున్న; పచ్చని = పసుపుపచ్చని; వలువవాని = వస్త్రములు కలవానిని; మేఘంబు = మేఘముల; పైన్ = మీద; ఉన్న = ఉన్నట్టి; మెఱుంగు = మెరుపుల; చందంబునన్ = వలె; ఉరమున = వక్షస్థలమునందు; శ్రీదేవి = లక్ష్మీదేవి; ఒప్పువానిన్ = చక్కగానుండువానిని; ముసురు = ఆవరించుచున్న; తేటులు = తుమ్మెదలు; విప్పన్ = తొలగిపోగా; ముఖ = ముఖములు; చతుష్కము = నాలుగు; కల = కలిగిన; తనయుడు = పుత్రుడు; ఆడెడి = క్రీడించు; బొడ్డు = నాభి; తమ్మివాని = పద్మముకలవానిని; కదలని = చలించని; బహు = పెక్కు; పదక్రమ = నడవడికల; విశేషంబులన్ = విశిష్టతల యొక్క; రవమున్ = శబ్దమును; చూపెడి = చేసెడి; నూపురములవానిన్ = కాలి అందెలుగలవానిని.
జలజగర్భ = బ్రహ్మదేవుడు; రుద్ర = పరమశివుడు; సనకసనందన = సనకాదుల {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్సుజాతుడు 3సనత్కుమారుడు అనెడి నలుగురు ఋషులు}; సత్ = మంచి; ద్విజ = బ్రాహ్మణులు; అమర = దేవతలుచే; ప్రశస్యమాన = కీర్తింపబడుచున్న; చరితుడు = వర్తన కలవాడు; ఐనవానిన్ = అయినవానిని; సౌందర్యఖని = చక్కదనమునకు గని; ఐనవానిన్ = అయినవానిని; ఒక్క = ఒక; పురుష = పురుషులలో; వర్యున్ = శ్రేష్ఠుని; కాంచెన్ = చూసెను.

భావము:

ఇంకా, ఆ అక్రూరుడు; ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఆ పానుపు మధ్య భాగంలో శయనించి ఉన్న అందాలగని అయిన పురుషోత్తముడిని దర్శించాడు. ఆ దివ్యపురుషుడు మెరిసిపోతున్న పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకుని ఉన్నాడు. మేఘంలో మెరిసే మెరుపు లాగ, అతని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఒప్పుతున్నది. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో ఆ నాలుగు ముఖాల నందనుడు క్రీడిస్తున్నాడు. ఆ పురుషోత్తముడు కాలు కదపకుండానే, కాలిఅందెలు ఎన్నో పదక్రమాల విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. ఆయన బ్రహ్మ, ఈశ్వర, సనక సనందన, సద్బ్రాహ్మణ, దేవతల చేత స్తుతింపబడుతుండే వాడు.