పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుని దివ్యదర్శనములు

  •  
  •  
  •  

10.1-1229-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్నాము చేసిచేసి నది ల్లని నీటను రామకృష్ణులన్
మానుగఁ జూచి "వారు రథధ్యముపై వసియించి యున్నవా
రీ ది నీటిలోపలికి నెప్పుడు వచ్చి?" రటంచు లేచి మే
ధానిధి చూచె వారిని రస్థుల భక్తమనోరథస్థులన్.

టీకా:

స్నానము = స్నానము; చేసిచేసి = బాగాచేసి; నది = నది యొక్క; చల్లని = చల్లగా ఉన్న; నీటను = నీటి యందు; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; మానుగన్ = చక్కగా; చూచి = చూసి; వారు = వారు; రథ = రథము; మధ్యము = నడిభాగము; పైన్ = మీద; వసియించి = ఉండి; ఉన్నవారు = ఉన్నట్టివారు; ఈ = ఈ; నది = నది యొక్క; నీటి = జలముల; లోపలి = లోని; కిన్ = కి; ఎప్పుడు = ఎప్పుడు; వచ్చిరి = వచ్చారు; అటంచున్ = అనుకొనుచు; లేచి = లేచి; మేధానిధి = బుద్ధిశాలి; చూచెన్ = చూసెను; వారిని = వారిని; రథస్థుల = రథముపై ఉన్నవారిని; భక్త = భక్తుల; మనస్ = మనస్సు లనెడి; రథస్థులన్ = రథము లందున్న వారిని.

భావము:

అలా వేదమంత్రాలు జపిస్తూ జపిస్తూ అక్రూరుడు మెల్లిగా స్నానం చేయసాగాడు. ఇంతలో అతనికి ఆ చల్లని నదీజలంలో బలరామకృష్ణులు చక్కగా కనబడ్డారు. “వీరు ఇంతదాక రథంలో కూర్చుని ఉన్నారు కదా. మరి ఈ యమున నీళ్ళలోకి ఎప్పుడు వచ్చారు? ” అనుకుంటూ లేచి, బుద్ధిశాలి అయిన ఆ అక్రూరుడు భక్తుల మనోరథాలు చేకూర్చే వారిద్దరూ మళ్ళీ ఆ రథంలోనే ఉండడం చూసాడు.