పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు బలకృష్ణుల గనుట

  •  
  •  
  •  

10.1-1201-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నె నక్రూరుఁడు పద్మనేత్రులను రంద్గాత్రులన్ ధేను దో
వాటీగతులన్ నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ
వీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్
నితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్.

టీకా:

కనెన్ = చూసెను; అక్రూరుండు = అక్రూరుడు; పద్మనేత్రులను = బలరామ కృష్ణులను {పద్మనేత్రులు - కమలములవంటి కన్నులు కలవారు, బలరాముడు మరియు కృష్ణుడు}; రంగత్ = కాంతివంతమైన; గాత్రులన్ = దేహము కలవారిని; ధేను = ఆవులను; దోహన = పితికెడి; వాటీ = శాల లందు; గతులన్ = ఉన్నవారిని; అలంకృతులన్ = శృంగారించుకొన్నవారిని; ఉద్యత్ = వృద్ధిచెందిన; భాసులన్ = ప్రకాశవంతులను; పీత = పసుపు పచ్చని; నీల = నల్లని; నవీన = కొత్త; ఉజ్వల = మెరుస్తున్న; వాసులన్ = బట్టలు కట్టుకొన్న వారిని; కుసుమ = పూల; మాలా = దండలు; ధారులన్ = ధరించినవారిని; ధీరులన్ = ధైర్యము కలవారిని; వనితా = స్త్రీలకు; కాములన్ = కోరబడువారిని; కృష్ణ = కృష్ణుడు; రాములన్ = బలరాములను; జగత్ = లోక మంతటికి; వంద్య = కొనియాడదగిన; క్రమ = మర్యాదచేత; ఉద్దాములన్ = గొప్పవారిని.

భావము:

పద్మముల వంటి కన్నులు కలవారు, చక్కటి వన్నెగల మేనులు కలవారు, వెల్లివిరిసే ప్రకాశము కలవారు, పచ్చని నల్లని క్రొంగొత్త వలువలు ధరించినవారు, పూలదండలు దాల్చినవారు, ధైర్యవంతులు, యువతుల పాలిటి నవమన్మథాకారులు, సకల జనులు మెచ్చుకొనే మర్యాదస్తులు అయిన శ్రీకృష్ణ బలరాములు అక్రూరుడు చేరే సరికి చక్కగా అలంకరించుకొని పాలు పితికే శాలలలో ఉన్నారు. అక్కడ వారిని అక్రూరుడు చూసాడు.