పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట

  •  
  •  
  •  

10.1-1195-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై
జాక్షంబయి కర్ణకుండల విరాద్గండమై యున్న యా
జాతాక్షు ముఖంబు చూడఁగలుగున్ త్యంబుపో నాకు నా
ది క్కేగుచు నున్న వీ వనమృగ వ్రాతంబు లీ త్రోవలన్.

టీకా:

అలక = ముంగురులచేత; భ్రాజితము = ప్రకాశించునది; ఐ = అయ్యి; సుధాంశు = చంద్రబింబమును; నిభము = పోలునది; ఐ = అయ్యి; హాస = నవ్వుల; ప్రభ = మెరుపులచేత; ఉద్దామము = గొప్పగా ఉన్నది; ఐ = అయ్యి; జలజా = పద్మముల వంటి; అక్షంబు = కన్నులు కలది; అయి = ఐ; కర్ణకుండల = చెవి కుండలములచేత; విరాజత్ = ప్రకాశించుచున్నట్టి; గండము = చెక్కిళ్ళు కలది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ యొక్క; జలజాతాక్షు = పద్మాక్షుని, కృష్ణుని; ముఖంబు = మోము; చూడన్ = చూచుట; కలుగున్ = జరుగును; సత్యంబుపో = ఇది తథ్యము; నా = నా; కున్ = కు; ఆవలదిక్కు = కుడివైపుగ; ఏగుచున్నవి = వెళ్ళుచున్నాయి; ఈ = ఈ; వన = అడవిలోని; మృగ = జంతువుల; వ్రాతంబులు = సమూహములు; ఈ = ఈ; త్రోవలన్ = దారి యందు.

భావము:

“పద్మాక్షుడైన శ్రీకృష్ణుడి ముఖము ముంగురులతో ముచ్చటగా ప్రకాశిస్తుంటుంది, చంద్రుడితో సరిపోలుతూ ఉంటుంది, నవ్వుల నిగ్గులతో నివ్వటిల్లుతూ ఉంటుంది. కమలదళాల వంటి కన్నులు, చెవులకమ్మల కాంతులతో అందగించే చెక్కిళ్ళు కలిగి ఉంటుంది. అటువంటి మోము దర్శించబోతున్నా. ఇది తథ్యం. ఇదిగో ఈ దారులమ్మట నేను ప్రయాణిస్తుంటే అడవిమృగాలు నాకు కుడిపక్కగా వెళ్తూ శుభాన్ని సూచిస్తున్నాయి.