పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట

  •  
  •  
  •  

10.1-1191-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ట్టి తపంబుఁ జేయఁబడె? నెట్టి చరిత్రము లబ్ధమయ్యెనో?
యెట్టి ధనంబు లర్హులకు నీఁబడెనో తొలిబామునందు; నా
ట్టి వివేకహీనునకు నాదిమునీంద్రులు యోగదృష్టులం
ట్టఁగలేని యీశ్వరుని బ్రహ్మమయున్ హరిఁ జూడఁగల్గెడిన్.

టీకా:

ఎట్టి = ఎటువంటి; తపంబున్ = తపస్సు; చేయబడెన్ = చేయబడినదో; ఎట్టి = ఎటువంటి; చరిత్రము = నడవడి; లబ్ధము = కలుగుట; అయ్యనో = జరిగినదో; ఎట్టి = ఎటువంటి; ధనంబుల్ = సంపదలు; అర్హుల్ = అర్హత కలవారల; కున్ = కు; ఈబడెనో = దానము చేయబడెనో; తొలి = పూర్వ; బాము = జన్మము; అందున్ = లో; నా = నా; అట్టి = లాంటి; వివేకహీనున్ = తెలివితక్కువవాని; కున్ = కి; ఆది = ప్రథమ; ముని = ఋషులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; యోగదృష్టులన్ = ఙ్ఞానదృష్టిచేత; పట్టగన్ = తెలిసికొన; లేని = శక్యముకాని; ఈశ్వరుని = భగవంతుని; బ్రహ్మమయున్ = పరబ్రహ్మతా నైన వానిని; హరిన్ = కృష్ణుని; చూడన్ = చూచుట; కలిగెడిన్ = లభించుచున్నది.

భావము:

“పూర్వజన్మలలో నేను ఎంతటి తపస్సు చేసానో! ఏమి గొప్ప పనులు చేసానో! ఎంత గొప్ప దానములు అర్హమైన వారికి చేసానో! ఆర్యులైన పరమ యోగుల యోగ దృష్టికి కూడ అందని భగవంతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుడిని చూడబోతున్నాను.