పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసుని మంత్రాలోచన

  •  
  •  
  •  

10.1-1156-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శువిశసనములు చేయుఁడు
శుపతికిం బ్రియముగాఁగ భావించి చతు
ర్దశినాడు ధనుర్యాగము
విదంబుగఁ జేయవలయు విజయముకొఱకున్."

టీకా:

పశు = పశువులను; విశసనములు = బలి ఇచ్చుటలు; చేయుడు = చేయండి; పశుపతి = శివుని; కిన్ = కి; ప్రియము = ప్రీతి; కాగన్ = అగునట్లు; భావించి = నిశ్చయించి; చతుర్దశి = చతుర్దశితిథి; నాడు = దినమున; ధనుర్యాగము = ధనుర్యాగమును; విశదంబుగన్ = ప్రసిద్ధముగ; చేయవలయున్ = చేయవలెను; విజయము = విజయము; కొఱకున్ = కలుగుటకోసము.

భావము:

చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. రుద్రుడికి ప్రీతిగా జంతుబలులు ఇవ్వండి.”