పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వృషభాసుర వధ

  •  
  •  
  •  

10.1-1144-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖుముల నేలఁ ద్రవ్వుచు నకుంఠిత వాల సమీరణంబులన్
వివిరఁ బోయి మేఘములు విప్ప విషాణము లొడ్డికొంచు దు
స్తతర మూర్తియై వృషభదైత్యుఁడు కన్నుల నిప్పు లొల్కఁగాఁ
దుతుర వచ్చి తాఁకె రిపుదుర్మదమోచనుఁ బద్మలోచనున్.

టీకా:

ఖురములన్ = గిట్టలతో, డెక్కలతో; నేలన్ = భూమిని; త్రవ్వుచున్ = కోరాడుచు; అకుంఠిత = అణపరాని; వాల = తోక విసురుటవలని; సమీరణంబులన్ = వాయువులచేత; విరవిరబోయి = చెదిరిపోయి; మేఘములు = మేఘములు; విప్పన్ = విడిపోగా; విషాణములు = కొమ్ములు; ఒడ్డికొనుచు = పూనుకొనుచు; దుస్తరతర = మిక్కిలి దాటరాని {దుస్తరము - దుస్తరతరము - దుస్తరతమము}; మూర్తి = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి; వృషభదైత్యుడు = వృషభాసురుడు; కన్నులన్ = కళ్ళమ్మట; నిప్పులు = అగ్నికణములు; ఒల్కగాన్ = రాలుచుండగా; తురతుర = బిరబిర; వచ్చి = వచ్చి; తాకెన్ = తలపడెను; రిపు = శత్రువుల; దుర్మద = చెడ్డగర్వమును; మోచనున్ = పోగొట్టువానిని; పద్మలోచనున్ = శ్రీకృష్ణుని.

భావము:

ఆ వృషభాసురుడు గిట్టలతో నేల త్రవ్వుతూ, గిరగిర త్రిప్పుతున్న తన వాలం గాలికి మబ్బులు విరవిర విచ్చిపోగా, కొమ్ములొడ్డుతూ, నిరోధింపరాని స్వరూపంతో, కండ్ల నుంచి గుప్పుగుప్పున నిప్పులు రాలుతుండగా, శత్రువుల గర్వం అణిచేవాడూ తామర రేకుల వంటి కన్నులు కలవాడూ అయిన కృష్ణుణ్ణి రివ్వురివ్వున వచ్చి ఎదుర్కున్నాడు.