పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రాసక్రీడా వర్ణనము

  •  
  •  
  •  

10.1-1088-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కురిసెం బువ్వుల వానలు
మొసెన్ దుందుభులు మింట ముదితలుఁ దారున్
సన్ గంధర్వపతుల్
రుసన్ హరిఁ బాడి రపుడు సుధాధీశా!

టీకా:

కురిసెన్ = వర్షించెను; పువ్వుల = పూల; వానలున్ = వానలు; మొరసెన్ = మోగినవి; దుందుభులు = భేరీలు; మింటన్ = ఆకాశము నందు; ముదితలున్ = ముగ్ధలు; తారున్ = తాము; సరసన్ = చేరి; గంధర్వ = గంధర్వులలో; పతుల్ = శ్రేష్ఠులు; వరుసన్ = క్రమముగా; హరిన్ = కృష్ణుని గురించి; పాడిరి = కీర్తించిరి; అపుడు = ఆ సమయము నందు; వసుధాదీశ = రాజా.

భావము:

ఓ మహారాజా! అప్పుడు పూల వానలు కురిసాయి; ఆకాశాన భేరులు మ్రోగాయి; గంధర్వ నాయకులు తమ తరుణులు సరసన ఉండగా కృష్ణుడిని స్తుతించారు.