పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రాసక్రీడా వర్ణనము

  •  
  •  
  •  

10.1-1085-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుములు వీగియాడఁ, జిఱువ్వులు నివ్వటిలంగ, హారముల్
సుడివడ, మేఖలల్ వదలఁ, జూడ్కిమెఱుంగులు పర్వ. ఘర్మముల్
పొమఁ, గురుల్ చలింప, శ్రుతిభూషణముల్ మెఱయన్, సకృష్ణలై
తుక లాడుచుం జెలఁగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్.

టీకా:

నడుములు = నడుములు; వీగియాడన్ = తూగాడుతుండగా, ఊగిపోతుండగా; చిఱునవ్వులున్ = చిరునవ్వులు; నివ్వటిల్లంగ = అతిశయించగా; హారముల్ = మెడలోని దండలు; సుడివడన్ = చిక్కుపడిపోతుండగ; మేఖలల్ = మొలనూళ్ళు; వదలన్ = జారిపోతుండగా; చూడ్కి = చూపుల; మెఱుంగులు = కాంతులు; పర్వన్ = పరచుకొంటుండగా; ఘర్మముల్ = చెమటలు; పొడమన్ = పుట్టగా; కురుల్ = తలవెంట్రుకలు; చలింపన్ = కదులుతుండగ; శ్రుతి = చెవుల యొక్క; భూషణముల్ = అలంకారములు; మెఱయన్ = ప్రకాశించుచుండగా; సకృష్ణలు = కృష్ణులతో కూడి ఉన్నవారు; ఐ = అయ్యి; పడతుకలు = యువతులు; ఆడుచున్ = నాట్య మాడుతు; చెలంగి = ఉత్సహించి; పాడిరి = పాటలు పాడిరి; మేఘ = మేఘము లందలి; తటిల్లతా = మెరుపుతీగల; ప్రభన్ = ప్రకాశముతో.

భావము:

నడుములు జవజవలాడగా; మందహాసాలు అతిశయించగా; మెడలోని దండలు మెలిపడగా; మొలనూళ్ళు వదులు కాగ; చూపుల నిగ్గులు ప్రకాశించగా; చెమటలు క్రమ్మగా; ముంగురులు చెదరగా; చెవికమ్మలు మెరయగా; ఆ నెలతలు నీలిమబ్బుల నడుమ మెరుపుతీగల్లా దీపిస్తూ; కృష్ణుడితో గూడి ఉల్లాసంగా ఆడారు పాడారు.