పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలతో సంభాషించుట

  •  
  •  
  •  

10.1-1080-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వు ధర్మముఁ జూడనొల్లక ల్లిదండ్రుల బంధులన్
ల బిడ్డలఁ బాసి వచ్చిన న్నిషక్తల మిమ్ము నేఁ
దు; పాసితిఁ దప్పు సైపుఁడు; ద్వియోగభరంబునన్
లఁ బొందుచు మీర లాడిన వాక్యముల్ వినుచుండితిన్.

టీకా:

తగవు = న్యాయము; ధర్మమున్ = ధర్మమును; చూడన్ = ఎంచుటకు; ఒల్లక = అంగీకరించకుండ; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; బంధులన్ = బంధువులను; మగలన్ = భర్తలను; బిడ్డలన్ = సంతానమును; పాసి = విడిచిపెట్టి; వచ్చిన = వచ్చినట్టి; మత్ = నా యొక్క; నిషక్తలన్ = సేవించువారిని; మిమ్మున్ = మిమ్ము; నేన్ = నేను; తగదు = తగినపనికాదు (కాని); పాసితిన్ = దూరమైతిని; తప్పు = అపరాధమును; సైపుడు = ఓర్చుకొనండి; తత్ = ఆ యొక్క; వియోగ = ఎడబాటు వలని; భరంబునన్ = బాధచేత; వగలన్ = విచారములను; పొందుచున్ = అనుభవించుచు; మీరలు = మీరు; ఆడిన = పలికిన; వాక్యముల్ = మాటలు; వినుచుండితిన్ = వింటున్నాను.

భావము:

నా మీద మనస్సులను లగ్నం చేసి న్యాయమూ ధర్మమూ లెక్కించక మీ తల్లితండ్రులనూ, చుట్టాలనూ, పతులనూ, బిడ్డలనూ వదలిపెట్టి మీరు నా దగ్గరకు వచ్చారు. మీకు వియోగ వ్యథ కలిగించాను. నేను చేసిన ఈ తప్పును మన్నించండి. నా విరహవేదనతో ఎంతో నలిగిపోయిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను