పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలకు ప్రత్యక్షమగుట

  •  
  •  
  •  

10.1-1070-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిసురుచిర లలితాకృతిఁ
రుణులు గని ముక్త విరహతాప జ్వరలై
మోత్సవంబు సలిపిరి
మేశ్వరుఁ గనిన ముక్తబంధుల భంగిన్.

టీకా:

హరిన్ = కృష్ణుని; సు = మంచి; రుచిర = కాంతి గల; లలిత = మనోజ్ఞమైన; ఆకృతిన్ = రూపమును; తరుణులు = యువతులు; కని = చూసి; ముక్త = వదలిన; విరహ = ఎడబాటు వలని; తాప = సంతాపముచేత; జ్వరలు = తపించుట కలవారు; ఐ = అయ్యి; పరమ = అత్యుత్తమమైన; ఉత్సవంబున్ = వేడుకను; సలిపిరి = చేసిరి; పరమేశ్వరున్ = భగవంతుని; కనిన = చూసిన; ముక్తబంధుల = ముక్తులు, యోగులు; భంగిన్ = వలె.

భావము:

భగవంతుడిని దర్శించి, భవబంధాల నుంచి విముక్తి పొందిన భాగవతుల వలె నందనందనుడు కృష్ణుని ఉజ్వల సుందరాకారం సందర్శించి; ఆ గోపవనితలు విరహం వలన జనించిన తాపజ్వరం వదలినవారై పరమానందభరితులు అయ్యారు.