పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలు కృష్ణుని వెదకుట

  •  
  •  
  •  

10.1-1019-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిటి యై కౌఁగిటఁ జేర్చెను
టుడై వర్ధిల్లి కొలిచె డిఁ గృష్ణుండై
యిటు పదచిహ్నము లిడెఁ గ్రిం
టి బామున నేమి నోచి మ్మ ధరిత్రీ!"

టీకా:

కిటి = వరాహావతారుడు; ఐ = అయ్యి; కౌగిటన్ = ఆలింగనమున; చేర్చెను = చేర్చుకొనెను; వటుడు = వామనావతారుడు; ఐ = అయ్యి; వర్ధిల్లి = మిక్కిలి పెరిగి; కొలిచెన్ = కొలతవేసెను; వడిన్ = వేగముగ; కృష్ణుండు = కృష్ణుడు; ఐ = అయ్యి; ఇటు = ఇలా; పద = పాదముల; చిహ్నములు = గుర్తులు; ఇడెన్ = వేసెను; క్రిందటి = పూర్వపు; బామునన్ = జన్మ యందు; ఏమి = ఎలాంటి; నోచితి = నోమునోచినావు; అమ్మ = తల్లి; ధరిత్రీ = భూమాత.

భావము:

ఓ భూదేవీ! వరాహావతారం ధరించి నప్పుడు నిన్ను కౌగిట చేర్చుకున్నాడు. త్రివిక్రమ స్వరూప ధరుడై నిన్ను కొలిచాడు కదా. ఇప్పుడు కృష్ణుడు నీపై అడుగులు ఉంచాడు. పూర్వజన్మలలో నీవు ఎంతటి నోములు నోచావో!”