పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలు కృష్ణుని వెదకుట

  •  
  •  
  •  

10.1-1013-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ
రందురంబు వాఁడు, మధురంబగు వేణురవంబు వాఁడు మ
మ్మంజుపువ్వుఁదూపులకు గ్గము చేసె లవంగ! లుంగ నా
రంములార! మీకడకు రాఁడు గదా! కృప యుంచి చూపరే!

టీకా:

అంగజున్ = మన్మథుని {అంగజుడు - దేహమున పుట్టువాడు, మన్మథుడు}; ఐనన్ = అయినను; చూడన్ = తనను చూడగానే; హృదయంగముడు = మనోహరుడు; ఐ = అయ్యి; కరగించువాడు = మోహము పుట్టించువాడు; శ్రీ = లక్ష్మీదేవికి; రంగత్ = రంగస్థలమైన; ఉరంబువాడు = వక్షస్థలము కలవాడు; మధురంబు = ఇంపైనది; అగు = ఐనట్టి; వేణు = మురళీ; రవంబువాడు = ధ్వని చేయువాడు; మమ్మున్ = మమ్ములను; అంగజున్ = మన్మథుని; పువ్వు = పూల; తూపుల్ = బాణముల; కున్ = కు; అగ్గముచేసెన్ = ఒప్పగించెను; లవంగ = ఓ లవంగము చెట్టు; లుంగ = ఓ పుల్ల మాధీఫలము చెట్టు; నారంగములారా = ఓ నారింజ చెట్లు; మీ = మీ; కడ = వద్ద; కున్ = కు; రాడు = రాలేదు; కదా = కదా; కృపన్ = దయ; ఉంచి = ఉంచి; చూపరే = చూసి చెప్పండి.

భావము:

ఓ లవంగ వృక్షాల్లారా! ఓ మాధీఫల మొక్కల్లారా! ఓ నారింజ చెట్లులారా! దర్శించినంత మాత్రముననే మనసుకు ఇంపు కలిగించి మన్మథుడిని కూడా కరిగించే వాడూ, సిరిగల వక్షము గల వాడూ, మధుర మోహనంబైన మురళీనాదం చేసేవాడూ అయినట్టి మా నల్లనయ్య మమ్మల్ని మన్మథుని పూలబాణాలకు గురిజేసి మీ దగ్గరకు రాలేదు గదా! వస్తే దయతో మాకు చూపండమ్మా!