పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఆత్మారాముడై రమించుట

  •  
  •  
  •  

10.1-1004-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణాలోకములం బటాంచల కచార్షంబులన్ మేఖలా
బాహు స్తన మర్శనంబుల నఖాంవ్యాప్తులన్, నర్మవా
క్పరిరంభంబుల మంజులాధర సుధాపానంబులం గాంతలం
గించెన్ రతికేళిఁ గృష్ణుడు గృపం గందర్పుఁ బాలార్చుచున్.

టీకా:

కరుణా = దయతోకూడిన; ఆలోకములన్ = చూపులచేతను; పటాంచలన్ = పమిటచెంగులను; కచ = శిరోజముల; ఆకర్షంబులన్ = లాగుటలచేత; మేఖలా = నడుముల; కర = చేతుల; బాహు = భుజముల; స్తన = కుచములను; మర్శనంబులన్ = స్పృశించుటచేత; నఖాంక = గోటితో పెట్టు గుర్తుల; వ్యాప్తులన్ = పరచుటచేత; నర్మ = పరిహాసపు; వాక్ = సంభాషణలు; పరిరంభంబులన్ = ఆలింగనములచేత; మంజుల = మనోజ్ఞమైన; అధరసుధాపానంబులన్ = చుంబనములచేతను {అధర సుధా పానము – పెదవు లందలి అమృతమును తాగుట, చుంబనము}; కాంతలన్ = స్త్రీల; కరగించెన్ = మనసులు ద్రవింప జేసెను; రతికేళిన్ = మన్మథక్రీడ యందు; కృపన్ = దయతో; కందర్పున్ = మన్మథుని; పాలార్చుచున్ = ఉపేక్షిస్తూ, తిరస్కరించుచు.

భావము:

శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో చేలాంచల కేశాకర్షణలతోనూ; పిరుదులు, భుజములు, స్తనాలు స్పృశించుటతోనూ; నఖక్షతాలు ఉంచుటతోనూ; మేళము లాడుటతోనూ; ఆలింగనములు సల్పుటతోనూ; మధురమైన అధరామృతాలు అందించుటతోనూ; కందర్పుని గర్వ మణుస్తూ, గోపికలను కరుణతో కామకేళిలో కరగించాడు.