పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

  •  
  •  
  •  

10.1-974-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాంధవమున నైనఁ గనైన వగనైనఁ
బ్రీతినైనఁ బ్రాణభీతినైన
క్తినైన హరికిఁ రతంత్రులై యుండు
నులు మోక్షమునకుఁ నుదు రధిప!

టీకా:

భాంధవమున = బంధుత్వముచేత; ఐనన్ = అయినను; పగన = శత్రుత్వముచేత; ఐనన్ = అయినను; వగన్ = చింతచేత; ఐనన్ = అయినను; ప్రీతిన్ = ప్రేమచేతను; ఐనన్ = అయినను; ప్రాణభీతి = అతి మిక్కిలి భయముచేత; ఐనన్ = అయినను; భక్తి = భక్తిచేతను; ఐనన్ = అయినను; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పరతంత్రులు = లగ్నమైనవారు; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; జనులు = వారు; మోక్షము = ముక్తి; కున్ = కు; చనుదురు = వెళ్ళెదరు; అధిప = రాజా.

భావము:

రాజా! చుట్టరికంతో అయినా, విరోధంతో అయినా, చింతతో అయినా, సంతోషంతో అయినా, ప్రాణభయంతో అయినా, భక్తితో అయినా శ్రీహరి ఎడల ధ్యానపరతంత్రులై ఉండే జనులు తప్పక ముక్తిని పొందుతారు.