పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దేవకి కృష్ణుని కనుట

  •  
  •  
  •  

10.1-115-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ పురిటియింటి కుద్య
ద్దీపంబును బోలి చాల దీపించె నిజం
బీ పాపఁడు నలు మొగముల
యా పాపని గనిన మేటి గు" నని భక్తిన్.

టీకా:

ఈ = ఇక్కడి; పురిటి = ప్రసవ; ఇంటి = గృహమున; కున్ = కు; ఉద్యత్ = మిక్కిలి ప్రకాశించెడి; దీపంబున్ = దీపమును; పోలి = వలె; చాల = అధికముగ; దీపించెన్ = ప్రకాశించెను; నిజంబున్ = తథ్యముగా; ఈ = ఈ; పాపడు = శిశువు; నలు = నాలుగు (4); మొగముల = ముఖములు కలిగిన; ఆ = ఆ; పాపనిన్ = పుత్రుడైన బ్రహ్మదేవుని; కనిన = పుట్టించిన; మేటి = గొప్పవాడు; అగును = అయ్యే ఉండును; అని = అని; భక్తిన్ = భక్తితో.

భావము:

ఇంకా వసుదేవుడు “పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే.” అని అనుకొన్నాడు.