పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రుల విచారంబు

  •  
  •  
  •  

10.1-875-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు గురులగు యోగీంద్రుల
రుదుగ మోహితులఁ జేయు రిమాయ మమున్
గురుల మూఢవిప్రుల
నువడి మోహితులఁ జేయ నోపక యున్నే?

టీకా:

సుర = దేవతలలో; గురులు = శ్రేష్ఠులు; అగు = ఐన; యోగి = ఋషి; ఇంద్రులన్ = శ్రేష్ఠులను; అరుదుగా = అప్పు డప్పుడు; మోహితులన్ = మాయలోపడినవారిగా; చేయు = చెసెడిది యైన; హరి = విష్ణువు యొక్క; మాయ = మాయ; మమున్ = మమ్మల్ని; నర = మానవులలో; గురులన్ = గురువులను; మూఢ = అఙ్ఞానము పొందిన; విప్రులన్ = బ్రాహ్మణులను; ఉరవడిన్ = మిక్కిలి వేగముగా, విజృంభించి; మోహితులన్ = మాయలో పడినవారిగా; చేయనోపక = చేయలేకుండ; ఉన్నే = ఉండునా, ఉండదు.

భావము:

దేవతల గురువులు అయిన యోగీంద్రులనే విష్ణు మాయ అప్పుడప్పుడు మోహింప జేస్తుంది. మరి మానవ గురువులమూ, జడ విప్రులమూ అయిన మనలను విష్ణు మాయ మోహింప జేయలేదా?