పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు

  •  
  •  
  •  

10.1-871-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేశ్వరార్పణంబుగఁ
జనులకు భిక్ష యిడినఁ రమపదమునం
రఁగెద రఁట; తుది సాక్షా
త్పమేశుఁడు భిక్ష గొన్న లమెట్టిదియో?

టీకా:

పరమేశ్వర = భగవంతునికి; అర్పణంబుగన్ = సమర్పించినదిగా; పర = ఇతరులు; జనులుకు = ఎవిరికైనను; భిక్ష = ఆహారమును; ఇడినన్ = పెట్టినచో; పరమపదమున్ = వైకుంఠమునకు {పరమపదము - సర్వోత్కృష్ట స్థానము, మోక్షము}; పరగెదరు = వెళ్ళదరు; అట = అంటారు; తుదిన్ = చివరకి; సాక్షాత్ = ప్రత్యక్షముగా; పరమేశుడున్ = కృష్ణపరమాత్మయే; భిక్ష = ఆహారము; కొన్నన్ = తీసుకుంటే దానికి; ఫలము = ఫలితము; ఎట్టిదియో = ఎంత గొప్పగా నుండునో.

భావము:

“పరమేశ్వరార్పణం” అంటూ ఎవరికైనా భిక్ష పెడితేనే పరమపదం లభిస్తుంది అంటారు. మరి సాక్షాత్తు పరమేశ్వరు డైన శ్రీకృష్ణ భగవానుడే భిక్ష స్వీకరిస్తే కలిగే ఫలితం ఎంతటిదో చెప్పడం సాధ్యం కాదు కదా!