పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఏకవింశత్యవతారములు

  •  
  •  
  •  

1-72-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్
ణీదేవతలార! మీరలు మహాన్యుల్ సమస్తజ్ఞులున్
రిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్

టీకా:

హరి = హరియొక్క; పాద = పాదములు; ద్వయ = జంట మీది; భక్తి = భక్తి; మీ = మీ; వలనన్ = వలన; ఇట్లు = ఈవిధముగా; ఆరూఢమై = నెలకొని, ఎంతగానో; ఉండున్ = ఉండును; ఏతిరుగన్ = ఇంకొక విధముగ; పాఱదు = విస్తరించదు; చిత్త = చిత్తము యొక్క; వృత్తి = ప్రవృత్తి; హరి = హరి; పై = మీద; దీపించి = ప్రకాశిస్తూ; మీ = మీ; లోపలన్ = అందు; ధరణీదేవతలారా = విప్రులులారా {ధరణీదేవుడు - ధరణీ (భూమికి) దేవుడు, విప్రుడు}; మీరలు = మీరు; మహా = మిక్కిలి, గొప్ప; ధన్యులు = సార్థకజీవులు; సమస్త = సర్వము; అజ్ఞులున్ = తెలిసిన వారు; హరి = హరిమీది; చింతన్ = భక్తి వలన; మిమున్ = మిమ్ములను; చెందవు = అంటవు; ఎన్నడును = ఎప్పుడూ; జన్మాంతర = వివిధజన్మలలో; వ్యధ = బాధలయొక్క; యోగముల్ = యోగములు.

భావము:

“ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.