పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఏకవింశత్యవతారములు

  •  
  •  
  •  

1-70-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్
గిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
ణిత నర్తనక్రమము జ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?

టీకా:

జగత్ = సృష్టికి; అధి = పై; నాథుడు = పతి - అధిపతి; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; సంతత = ఎడతెగని; లీలలు = లీలలు; నామ = నామాలు; రూపముల్ = రూపములు; తగిలి = పూనుకొని; మనో = ఆలోచనల; వచో = వాక్కుల; గతులన్ = రీతులతో; తార్కిక = తర్కమునకు సంబంధించిన; చాతురి = నేర్పు; ఎంత = ఎంత; కల్గినన్ = కలిగి యున్నప్పుటికిని; మిగిలి = అతిశయించి; కు = చెడ్డ; తర్క = హేతు విమర్శ; వాది = వాదించువాడు - చెడ్డ వాదనలు వాదించువాడు; తగ = తగిన; మేరలు = హద్దులు; సేసి = చేసి; ఎఱుంగ = తెలిసికొన; నేర్చునే = గలడా; అగణిత = లెక్కకందని; నర్తన = నాట్యము, నృత్యము; క్రమమున్ = విలువ; అజ్ఞుఁడు = అజ్ఞానము కలవాడు; ఎఱింగి = అర్థము చేసికొని; నుతింపన్ = అభినందించుట; ఓపునే = చేయకలడా.

భావము:

సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.