పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా సూచనంబు

  •  
  •  
  •  

1-62-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై-
చారు షోడశ కళాహితుఁ డగుచుఁ,
బంచమహాభూత భాసితుండై శుద్ధ-
త్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ,
రణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి-
ములు నానాసహస్రములు వెలుఁగ,
నంబర కేయూర హార కుండల కిరీ-
టాదులు పెక్కువేమరుచుండఁ,

1-62.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బురుషరూపంబు ధరియించి రుఁ, డనంతుఁ,
ఖిల భువనైకవర్తన త్నమమర
మానితోదార జలరాశి ధ్యమునను
యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు."

టీకా:

మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; తన్మాత్ర = తన్మాత్రలతో {తన్మాత్రలు - శబ్ద స్పర్శ రస, రూప గంధములు}; సంయుక్తుఁడై = కూడినవాడై; చారు = అందమైన; షోడశ = పదహారు; కళా = కళలతో; సహితుఁడు = కూడినవాడు; అగుచున్ = అగుచూ; పంచ = ఐదు; మహాభూత = మహాభూతములలోను {మహాభూతములు - మనస్సు, పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము.}; భాసితుండు = వెలుగొందుచున్నవాడు; ఐ = అయ్యి; శుద్ధ = నిర్మలమైన; సత్త్వుఁడు = సత్త్వగుణము కలవాడు; ఐ = అయ్యి; సర్వ = సర్వమును; అతిశాయి = అతిశయించినవాడు; అగుచున్ = అగుచూ; చరణ = పాదములు; ఊరు = తొడలు; భుజ = భుజములు; ముఖ = ముఖములు; శ్రవణ = చెవులు; అక్షి = కళ్లు; నాస = ముక్కులు; శిరములు = తలలు; నానా = అనేకమైన; సహస్రములు = వేనవేలు; వెలుఁగన్ = ప్రకాశించుచుండగా; అంబర = వస్త్రములు; కేయూర = భుజకీర్తులు; హార = హారములు; కుండల = కుండలములు; కిరీట = కిరీటములు; ఆదులు = మొదలగునవి; పెక్కు = అనేకమైన; వేలు = వేలు; అమరుచుండన్ = ధరింపబడియుండగా; పురుష = పరమ పురుష, విశ్వరూపము; రూపంబు = రూపము;
ధరియించి = ధరించి; పరుఁడు = అన్నిటికంటె వేరైన వాడు; అనంతుడు = అంతము లేనివాడు; అఖిల = సమస్త; భువన = లోకములందు; ఏక = ఒకేమాఱు; వర్తన = ఉండు; యత్నము = ప్రయత్నము; అమర = సిద్ధించగ; మానిత = పూజనీయమైన; ఉదార = పెద్ద; జలరాశి = సముద్రము; మధ్యమునను = నడుమ; యోగ = యోగ; నిద్రా = నిద్రతో; విలాసియై = విరాజిల్లుతూ; ఒప్పుచుండు = ఒప్పియుండును.

భావము:

“పరాత్పరుడు, అనంతుడు ఐన ఆ భగవంతుడు సమస్త భువనాలనూ సృష్టింప దలచి; మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశకళాపరిపూర్ణుడై; పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై; శుద్ధసత్త్వస్వరూపుడై; సర్వేశ్వరుడై; వేలకొలది పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కన్నులు, శిరస్సులతో అలరారుతూ; వేలకొలది వస్ర్తాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి; పరమపురుష రూపం ధరించి; యోగనిద్రా ముద్రితుడై మహా సముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు.