పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా సూచనంబు

  •  
  •  
  •  

1-60-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మపూరుషుఁ, డొక్కఁ, డాఢ్యుఁడు, పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు; ముకుంద, పద్మజ, శూలి సంజ్ఞలఁ బ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు; నందు శుభస్థితుల్
రి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.

టీకా:

పరమ = ఉత్కృష్టమైన; పూరుషుడు = పురుషోత్తముడు {పూరుషుడు - కారణభూతుడు, విష్ణువు}; ఒక్కఁడు = ఒకడే అయిన వాడు; ఆఢ్యుఁడు = శ్రేష్ఠమైనవాడు; పాలన = పాలనము (స్థితి); ఉద్భవ = ఉద్భవించుట (సృష్టి); నాశముల్ = నశింపజేయుట (లయము); సొరిదిన్ = వరుసగా; చేయు = చేసేటటువంటి; ముకుంద = ముకుందుడు, విష్ణువు; పద్మజ = పద్మజ, బ్రహ్మ; శూలి = శూలి, శివుడు; సంజ్ఞలన్ = పేర్లతో; ప్రాకృత = ప్రకృతి నుండి; స్ఫురిత = వ్యక్తమైన; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమంబులన్ = తమస్సులను; పొందున్ = పొందును; అందున్ = వానిలోనే; శుభస్థితుల్ = శుభమైన స్థితులు, భోగమోక్షములు; హరి = హరి; చరా = కదిలే జీవులు; అచర = కదలనివియైన జీవులు; కోటి = అనేకము; కిన్ = నకు; ఇచ్చున్ = ఇచ్చును; అనంత = అంతములేని; సత్త్వ = సత్త్వగుణముతో; నిరూఢుఁడై = స్థిరముగా నున్నవాడై.

భావము:

పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తు, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు.