పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా సూచనంబు

  •  
  •  
  •  

1-57-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణునకు, నరునకు,
భాతికిని మ్రొక్కి; వ్యాసు దములకు నమ
స్కాము సేసి, వచింతు ను
దాగ్రంథంబు, దళిత ను బంధంబున్.""

టీకా:

నారాయణున = నారాయణున; కున్ = కు; నరున = నరున; కున్ = కు; భారతి = సరస్వతీ దేవి; కిని = కి; మ్రొక్కి = నమస్కరించి; వ్యాసు = వ్యాసుని; పదముల = పాదముల; కున్ = కు; నమస్కారము = నమస్కారము; చేసి = చేసి; వచింతున్ = చెప్పెదను; ఉదార = ప్రకాశించే; గ్రంథంబు = గ్రంథము; దళిత = ఖండింపబడిన; తను = జన్మ; బంధంబున్ = బంధములు కలది.

భావము:

నరనారాయణలకు నమస్కారం చేసి; సరస్వతీదేవికి మ్రొక్కి;, వ్యాసులవారి పాదపద్మాలకు ప్రణామం కావించి; జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథం అయిన భాగవతాన్ని వినిపిస్తాను.”