పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా సూచనంబు

  •  
  •  
  •  

1-56.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాఁటఁ గోరెడివారికి య దలిర్ప
నే తపోనిధి వివరించె నేర్పడంగ,
ట్టి శుకనామధేయు, మహాత్మగేయు,
విమల విజ్ఞాన రమణీయు, వేడ్కఁ గొలుతు.

టీకా:

కార్య = కార్యముల యొక్క; వర్గంబునున్ = సమూహమునూ; కారణ = కారణముల; సంఘంబున్ = సమూహమునూ; అధికరించి = అతీతముగ; చరించు = వర్తించునట్టి; ఆత్మతత్త్వము = ఆత్మ యొక్క తత్త్వము; అధ్యాత్మము = అధ్యాత్మము); అనఁబడున్ = అని చెప్పబడుతుంది; అట్టి = అటువంటి; అధ్యాత్మమున్ = అధ్యాత్మమును; తెలియన్ = తెలియునట్లు; చేయఁగజాలు = చేయగలిగినట్టి; దీపము = దీపము; అగుచు = అవుతూ; సకల = సమస్త; వేదములకు = వేదాలకు; సారాంశము = సారాంశము; ఐ = అయి; ఏకము = ప్రత్యేకమైనది, అనన్యమైనది; ఐ = అయ్యి; అసాధారణము = అసాధారణము; అగు = అయినటువంటి; ప్రభావ = ప్రభావముతో; రాజకంబు = ప్రకాశించునది; ఐన = అయినట్టి; పురాణ = పురాణములలోని; మర్మంబును = మూలసూత్రమును; గాఢ = దట్టమైన; సంసార = సంసారమనే; అంధకార = చీకటి; పటలి = సమూహము;
దాఁటన్ = తరించాలని; కోరెడి = కోరుకొను; వారి = వారి; కిన్ = కి; దయ = దయ; తలిర్పన్ = చిగురించగా; ఏ = ఏ; తపస్ = తపస్సు అను; నిధి = నిధి కలవాడు; వివరించెన్ = వివరించాడో; ఏర్పడంగన్ = అర్థమయ్యేటట్లు; అట్టి = అటువంటి; శుక = శుకుడనే; నామ = పేరు; ధేయు = ధరించిన; మహా = గొప్ప; ఆత్మ = ఆత్మకలవారి చేత; గేయున్ = కీర్తింపబదగువానిని; విమల = నిర్మలమైన; విజ్ఞాన = విజ్ఞానము గల; రమణీయు = మనోహారుని; వేడ్కన్ = ఆసక్తితో; కొలుతున్ = ఆరాధిస్తున్నాను.

భావము:

కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్త్వాన్ని పెద్దలు అధ్యాత్మికం అంటారు. అటువంటి అధ్యాత్మతత్త్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసేటట్టిది, సకల వేదాల సారభూతమైనట్టిది, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయినట్టి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపారకృపాపయోనిధి, తపోనిధి, విశేష వివేక విజ్ఞానాల పెన్నిధి, వేదవ్యాసుల పుత్రుడు, సుధీజనస్తుతిపాత్రుడు అయినట్టి శ్రీశుకులవారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను.