పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-50-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినామ కథన దావానలజ్వాలచేఁ-
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ-
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
మలనాభధ్యాన కంఠీరవంబుచేఁ-
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరప్రభాకరదీప్తిఁ-
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;

1-50.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి నఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!

టీకా:

హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, సృష్ట్యారంభమున పంచమాహాభూతములను సమ్మేళనము చేసినవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 405వ నామం}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిననయన = పద్మాల వంటి కళ్ళు కలవాడు, భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి {విష్ణుః- సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, హరి, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 2వ, 258వ, 657వ నామం}; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.

భావము:

పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావా!