పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-40-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాపసు లిట్లనిరి, వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హరి గుణ సం
ఘాతున్, సూతున్, నితాంత రుణోపేతున్.

టీకా:

ఆ = ఆ; తాపసులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి; వినీతున్ = విశిష్టమైన నీతిగల వానిని; విజ్ఞాన = విజ్ఞాన మయ; ఫణిత = విధానంలో; నిఖిల = అన్ని; పురాణ = పురాణాల; వ్రాతున్ = సమూహము గలవానిని; నుత = స్తోత్రము చేయబడిన; హరి = విష్ణుని; గుణ = గుణముల; సంఘాతున్ = సమూహాలున్న వానిని; సూతున్ = సూతుని; నితాంత = ఎల్లప్పుడు; కరుణ = దయతో; ఉపేతున్ = కూడినవాని.

భావము:

ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు.