పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

1-34-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని-
లన నేర్పడు, ననుర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై-
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె-
నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీటఁ గాచాదుల-
న్యోన్యబుద్ధి దా డరునట్లు

1-34.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద,
నఘు సత్యుఁ బరుని నుదినంబు.

టీకా:

విశ్వ = విశ్వముల యొక్క; జన్మ = పుట్టుక; స్థితి = పాలించుటలు; విలయంబులు = నాశనములు; ఎవ్వాని = ఎవ్వని; వలనన్ = వలననైతో; ఏర్పడున్ = ఏర్పడుతాయో; అనువర్తనమున = అనుకూలంగా వర్తించుటలోను; వ్యావర్తనమున = వ్యతిరేకముగా వర్తించుటలోను; కార్యములు = వ్వవహారములు; అందున్ = లోను; అభిజ్ఞుఁడు = బాగా తెలిసినవాడు; ఐ = అయ్యి; తాన = తనే; రాజు = పరిపాలించేవాడు; అగుచు = అయ్యి; చిత్తమున = మనసున; చేసి = సంకల్పించినంత మాత్రమున; వేదంబులు = వేదములు; అజునకు = పుట్టుక లేనివాడైన బ్రహ్మకు {అజుడు - ఎవరిగర్భంలోను పుట్టుక లేనివాడు}; విదితములు = తెలియునట్లు; కావించెన్ = చేసినది; ఎవ్వఁడు = ఎవరో; బుధులు = జ్ఞానులు; మోహింతురు = మోహిస్తారో; ఎవ్వనికి = ఎవరినినో; ఎండమావుల = ఎండమావులలోని; నీటన్ = నీరు; కాచన్ = గాజు; ఆదులన్ = మొదలగు వానిలో వలె; అన్యోన్య = ఒకదానిలోనింకోటి; బుద్ధి = ఉండినట్లు అనిపించుచు; తాన్ = అదే; అడరునట్లు = ప్రకాశించినట్లు;
త్రిగుణసృష్టి = త్రిగుణాత్మక సృష్టి; ఎందున్ = ఎందులోనైతే; దీపించి = కనిపించుతూ; సత్యము = నిజము; భంగిన్ = వలె; తోఁచున్ = అనిపించునో; స్వ = తన; ప్రభా = ప్రభావముచే; నిరస్త = తొలగింపడిన; కుహకుఁడు = మాయ కలవాడు; ఎవ్వఁడు = ఎవ్వడో; అతనిన్ = అతనిని; కోరి = కోరి; చింతించెదన్ = ప్రార్థింతును; అనఘున్ = పాప మంటని వానిని; సత్యున్ = సత్యమైన వానిని; పరునిన్ = అందఱికి పై నున్నవానిని; అనుదినంబు = ప్రతిరోజు.

భావము:

ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసాడో; ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను.