పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-525-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిన్ మేనమఱందియై, సచివుఁడై, యే మేటి మాతాతలన్
లిమిం గాచి సముద్ర ముద్రిత ధరం ట్టంబుఁ గట్టించె, న
య్యఘుం, డీశుఁడు, చక్రి, రక్షకుఁడు గాన్యుల్ విపద్రక్షకుల్
రే? వేఁడెద భక్తి నా గుణనిధిం, గారుణ్యవారాన్నిధిన్.

టీకా:

ఎలమిన్ = సంతోషముగ; మేనమఱంది = మేనమరిది; ఐ = అయి; సచివుఁడు = మంత్రి; ఐ = అయి; ఏ = ఏ; మేటి = శ్రేష్ఠుడు – గొప్పవాడు; మా = మా; తాతలన్ = తాతలను; బలిమిన్ = బలముగ; గట్టిగా; కాచి = కాపాడి; సముద్ర = సముద్రములచే; ముద్రిత = చుట్టబడిన; ధరన్ = భూమిని; పట్టంబున్ = పట్టము; కట్టించెన్ = కట్టించెను; పట్టాభిషిక్తులను చేసెను; ఆ = ఆ; అలఘున్ = చిన్న కానివాడు; గొప్పవాడు; ఈశుఁడు = ప్రభువు; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; రక్షకుఁడు = రక్షించువాడు; కాక = అంతేగాని; అన్యుల్ = ఇతరులు; విపత్ = ఆపదల నుండు; రక్షకుల్ = రక్షించువారు; కలరే = కలరా ఏమి; లేరు; వేఁడెదన్ = ప్రార్థించెదను; భక్తిన్ = భక్తితో; ఆ = ఆ; గుణ = గుణముల; నిధిన్ = పాతర వంటివాని; కారుణ్య = దయకు; వారాన్నిధిన్ = సముద్రుని.

భావము:

ఏ మహానుభావుడు ప్రియమైన మరదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను చతుస్సముద్ర ముద్రితమైన ధరణీచక్రానికి చక్రవర్తులను చేసాడో, ఆ మహాత్ముడు, ఆ లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదరాభిమానాలతో ఆదుకొనే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు? ఆ భక్తులపాలిటి పెన్నిధిని ఆ కారుణ్యవారాన్నిధిని భక్తితో వేడుకొంటాను.