పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-520-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై
బ్రహ్మభావముననుఁ ర్యటింప,
వెఱ్ఱి యంచు శుకుని వెంట నేతెంతురు
వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు.

టీకా:

వెఱ్ఱి = కపట; తనము = స్వభావము; మాని = మాని; విజ్ఞాన = విజ్ఞానమునే; మూర్తి = స్వరూపముగా కలవాడు; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మము తానే; భావమునను = అను భావముతో; పర్యటింపన్ = చరించుచుండ; వెఱ్ఱి = ఉన్మాదుడు; అంచున్ = అనుచు; శుకుని = శుకమహర్షి; వెంటన్ = వెంటపడి; ఏతెంతురు = వస్తూ ఉంటారు; వెలఁదులు = ఆడవారును; అర్భకులును = పిల్లలును; వెఱ్ఱులు = తెలివితక్కువ వారు; అగుచున్ = అగుచు.

భావము:

వెఱ్ఱిలోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో, బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీశుకుణ్ణి వెఱ్ఱివాడని భావించి ఏదో వెఱ్ఱెత్తినట్టు స్త్రీలూ, బాలకులూ ఆయన వెంటబడి పరుగెత్తుకొంటూ వస్తుంటారు.